- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


1990వ దశలో తెలుగు తమిళ భాషలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ముద్దుగుమ్మల్లో సంగతి ఒకరు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఉన్నత కుటుంబంలో జన్మించిన సంఘవి ముందుగా 1993 లో ఒరువ‌ర్ తో తన సినిమా ప్రయాణం ప్రారంభించింది. అనతి కాలంలోనే అందరి దృష్టి ఆకర్షించింది. 15 ఏళ్లకు పైగా కెరీర్లు 80 పైగా సినిమాలలో నటించిన సంఘవి బుల్లితెరపై కూడా ప‌లు సీరియ‌ల్స్ లో నటించింది. కెరీర్ పీక్ టైంలో ఉండగానే సంఘవి పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. రాజశేఖర్ శివయ్య సినిమాలో నటిస్తున్న టైంలో ఆ సినిమా దర్శకుడు సురేష్ వర్మతో సంఘవి ప్రేమలో పడింది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా 2000 సంవత్సరంలో సురేష్ వ‌ర్మ ను పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని ఏళ్ళకే వీరి మధ్య విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత జీవితం సంఘవి కెరీర్ ను బలంగా దెబ్బ కొట్టింది.


ఎప్పుడైతే సురేష్ వ‌ర్మ‌ను పెళ్లి చేసుకుందో అక్కడి నుంచి సంఘవి సినిమా కెరియర్ డౌన్ అవుతూ వచ్చింది. 2005 నుంచి సినిమాలు చేయటం తగ్గించిన ఆమె 2008 తర్వాత వెండి తెరపై క‌నుమరుగయింది. చాలా యేళ్లు ఒంటరి జీవితాన్ని గ‌డిపిన‌ సంఘవి 2016లో ఐటీ ఉద్యోగి వెంకటేష్ ని రెండో పెళ్లి చేసుకుంది. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లైన నాలుగేళ్లకు 2020లో సంఘవికి చాన్వి అనే అమ్మాయి పుట్టింది. ప్రస్తుతం తన భర్త వెంకటేష్ కూతురుతో సంఘ‌వి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది. ఆమె 2019లో ఓ తమిళ సినిమాతో రెండో ఇన్నింగ్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె రెండో ఇన్నింగ్స్ కూడా అనుకున్న స్థాయిలో అయితే లేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: