తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ , ఆచార్య అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో కూడా చరణ్ తో పాటు వేరే హీరోలు కూడా నటించారు. ఇక చరణ్ సోలో హీరోగా ఆఖరుగా వినయ విధేయ రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత చరణ్ సోలో హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. చరణ్ సోలో హీరోగా చాలా సంవత్సరాల తర్వాత నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ కి నెగిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పెద్ద రికార్డులను సృష్టించలేక పోతుంది. ఇకపోతే నిన్న ఈ మూవీ కి బుక్ మై షో లో చాలా తక్కువ సేల్స్ జరిగాయి.

అసలు విషయం లోకి వెళితే ... ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించిన 74.54 కే టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీ లో చరణ్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. రెండు పాత్రలో ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: