- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


ప్ర‌స్తుతం ప్ర‌భాస్ పేరు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో మార్మోగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రీ ముఖ్యంగా బాహుబ‌లి సీరిస్ సినిమాల‌తో ప్ర‌భాస్ పేరు పాన్ ఇండియా ఎల్ల‌లు దాటేసి వ‌ర‌ల్డ్ వైడ్ గా భార‌తీయ సినీ ప్రేమికులు ఎక్క‌డ ఉన్నా కూడా మార్మోగుతోంది. ఆ త‌ర్వాత రాధేశ్యామ్ - సాహో - ఆదిపురుష్ పెద్ద‌గా అంచ‌నాలు అందుకోలేదు. అయితే స‌లార్ - క‌ల్కి సినిమా లు రెండు సూప‌ర్ హిట్లు అయ్యాయి. ఆరు నెల‌ల గ్యాప్‌లో వ‌చ్చిన ఈ రెండు సినిమా ల త‌ర్వాత ఇప్పుడు ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత గా మార్మోగుతోంది. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ ఈ స‌మ్మ‌ర్ కు ది రాజా సాబ్ సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.


రాజుల వంశీయుడు అయిన ప్ర‌భాస్ అన్ని విష‌యాల్లో నూ అదే రాజ‌సంతో ఉంటాడ‌ని చెపుతుంటారు. త‌న సినిమా ల్లో ప‌ని చేసే తోటి న‌టీ న‌టుల నుంచి హీరోయిన్ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని ఎంతో మ‌ర్యాద‌గా చూసుకుంటాడు. ప్రభాస్ పెట్టే భోజ‌నాలు.. రాజ మ‌ర్యాద‌లు మామూలుగా ఉండ‌వ‌ని చెపుతుంటారు. ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ప్ర‌భాస్ నే ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింద‌ట‌.


హీరోయిన్ ఎవ‌రో కాదు .. ప్ర‌భాస్ కు జోడీగా రాధేశ్యామ్ సినిమాలో న‌టించిన పూజా హెగ్డే. భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా 2022 లో పాన్ ఇండియా సినిమా గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన ఈ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో పూజ‌కు ఐరెన్ లెగ్ అన్న ట్యాగ్ వ‌చ్చింది. ఈ సినిమా లో పూజ ప్ర‌భాస్ ను చాలా ఇబ్బంది పెట్ట‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య అనుకున్న స్థాయిలో కెమిస్ట్రీ పండేల‌దు. చివ‌ర‌కు పూజా తో క‌లిసి ప్ర‌భాస్ స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో మిర్ర‌ర్ పెట్టి ఇద్ద‌రి సీన్లు వేర్వేరుగా షూట్ చేసి క‌ల‌పాల్సి వ‌చ్చింది.


పూజా హెడ్ వెయిట్ చూపిస్తూ .. షూటింగ్ కి వచ్చాక గంటల గంటలు కేరవాన్ లో కూర్చుని చిత్ర యూనిట్ అందరిని ఇబ్బంది పెట్టేదని కొంతమంది సినీ ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు. అలాగే డేట్లు ఇస్తాన‌ని చెప్పి కూడా చాలాసార్లు డుమ్మా కొట్టిన సంద‌ర్భాలు ఉన్నాయి. అందుకే ఆమె తీరుతో విసిగి పోయిన ప్ర‌భాస్ ఆమెతో మ‌ళ్లీ ఫ్యూచ‌ర్ లో సినిమా చేయ‌కూడ‌ద‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: