బిగ్ బాస్ బ్యూటీ విష్ణు ప్రియ, బుల్లితెర హీరో అమర్ దీప్ తో కలిసి నటించిన ఫోక్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుని ట్రెండ్ అవుతుంది. ఈ పాటకు అమర్ దీప్, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు.  ఈ సాంగ్ ని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ తో నింపేస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి జానపద పాటతో అదుర్స్ అనిపించుకున్నారు వీరిద్దరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ అవుతుంది.
సంక్రాంతి కానుకగా ఈ పాటను రిలీజ్ చేశారు. 'కూ కూ కుమారి' అంటూ ఇద్దరు డాన్స్ తో ఇరగదీశారు. ఈ సాంగ్ స్టెప్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇక అందాల భామ విష్ణుప్రియ తన అందం, నటనతో పాటను ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. అమర్ దీప్ విషయానికి వస్తే.. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు గా.. ఇచ్చి పడేశాడు. వారిద్దరి డాన్స్, ఎనర్జీ కూడా చెప్పాల్సిన పనిలేదు.  
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ హవా ఏ రేంజ్‏లో ఉందో చెప్పక్కర్లేదు. తెలంగాణ జానపద పాటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఇప్పటివరకు సాధారణ ప్రజలు ఆడిపాడిన పాటలకు ఇప్పుడు సెలబ్రెటీలు సైతం స్టెప్పులేస్తున్నారు. అటు సినిమాల్లోనూ జానపద పాటలకే పట్టకడుతున్నారు. పూర్తిగా తెలంగాణ యాసలో వచ్చిన సినిమాల్లోని ఫోక్స్ సాంగ్స్ నే ఎంచుకుంటున్నారు. అటు సినిమాల్లోనే కాదు.. బుల్లితెర స్టార్స్ సైతం ఈ పాటలతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా.. గతంలో విష్ణుప్రియ, మానస్ కలిసి నటించిన జరీ జరీ పంచెకట్టు ఫోక్ సాంగ్‏కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ యూట్యూబ్‏లో అదరగొట్టింది. ఈ పాటకు భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా.. జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: