- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే మచ్చలేని హీరో .. తాతకి తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ కొడుకుగా తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బాలీవుడ్లోకి కూడా ఇంటర్ ఇవ్వబోతున్నాడు. అయితే అలాంటి హీరో మీద ఒక బాలీవుడ్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు చేశారు .. ఎన్టీఆర్ నిన్ను వాడుకున్నాడు అంటూ మరో హీరోయిన్ ని వేధించాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ? ఏ హీరోయిన్ ను వాడుకున్నాడు అన్న కాంట్రవర్సీ కామెంట్లు చేశారో ? ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటి పాయల్ ఘోస్ అంటే ఎవరికీ ? తెలియదు .. కానీ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా .. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిన‌ ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన క్యారెక్టర్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.


సినిమా షూటింగ్ టైంలో ఎన్టీఆర్ కి పాయ‌ల్ ఘోస్‌కు మధ్య మంచి స్నేహం ఏర్పడిందట. అంతేకాదు పాయల్ ఘోస్‌ ఎన్నో ఇంటర్వ్యూలలో బాలీవుడ్ నటినటుల‌ కంటే సౌత్ ఆర్టిస్టులు చాలా మ‌ర్యాద‌గా ఉంటార‌ని చెప్పింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ పై కూడా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ చాలా కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. నువ్వు ఏమైనా సతీ సావిత్రి వా ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు పెద్ద ప్రతివ్రత లా గా మాట్లాడుతున్నావు అంటూ నా ఆత్మ అభిమానం దెబ్బతినేలా వల్గర్ కామెంట్స్ చేశాడని పాయల్‌ పోయింది. అయితే అనురాగ్ చేసిన కామెంట్లను పాయల్‌ ఖండించింది. పాయ‌ల్ మాత్రం దక్షిణాది నటీనటుల దగ్గర మంచి వాతావరణం ఉంటుందని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఎన్టీఆర్ తనను చాలా బాగా చూసుకున్నారని ... ఎంతో బాగా మాట్లాడారని ఎప్పుడూ కూడా తనతో తప్పుగా ప్రవర్తించలేదని పాయల్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: