బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ గురించి పరిచయం అనవసరం. విష్ణు ప్రియ, బుల్లితెర హీరో అమర్ దీప్ తో కలిసి నటించిన 'కూ కూ కుమారి' ఫోక్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుని ట్రెండ్ అవుతుంది. అయితే ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 8 లో విష్ణు ప్రియ, పృథ్వీరాజ్ శెట్టి లవ్ స్టోరీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్ లో లవ్ బర్డ్స్ అంటే వీరిద్దరే గుర్తొస్తారు. సీజన్ మొత్తం విష్ణు, పృథ్వీ పనులు చేయడం. అతని పేరు ఎత్తితే చాలు సిగ్గుపడటం. ఆమె ఆటను కూడా పక్కన పెట్టి పృథ్వీరాజ్ ఆటపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం. నామినేషన్స్ లో కూడా అతనికి వ్యతిరేఖంగా ఉన్నవారిని నామినేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అతను తన డోఫోమైన్ అంటూ కూడా విఖ్యానించింది. అంతా ఎందుకు వీకెండ్ లో నాగార్జున సైతం వీళ్లిద్దరి గురించి మాట్లాడే విషయాలు కూడా ఎక్కువే. 8వ వారం నామినేషన్స్‌లో కూడా అటు పృథ్వీని ఇటు విష్ణుప్రియను మిగిలిన కంటెస్టెంట్స్ టార్గెట్ చేశారు. 'అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు.. చాలా వారాలుగా మీ గేమ్ కూడా ఏం కనిపించట్లేదు' అంటూ ఒకరి తర్వాత ఒకరు నామినేషన్స్ కూడా వేయడం జరిగింది.
బయటికి వచ్చాక కూడా విష్ణు ప్రియ, పృథ్వీరాజ్ శెట్టి ఫ్యాన్ పేజీ ఒకటి వారిద్దరి వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేయగా.. దానికి విష్ణు ప్రియ వావ్ ఈ ఎడిట్ ఎంత బాగుందని కామెంట్ చేసింది. అలాగే ఆ ఎడిట్ ని తన స్టోరీలో కూడా పెట్టుకుంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ భామ విష్ణు చేసిన సాంగ్ ని చూసిన అభిమానులు పృథ్వీరాజ్ శెట్టితో చేస్తే బాగుండు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీరిద్దరూ కలిసి ఒక్క ప్రాజెక్టు చేస్తే చూడాలని ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిజేస్తున్నారు.