ఏంటి చిరంజీవి కారణంగా ప్రభాస్ అన్నయ్య నాగార్జున దగ్గర 60 కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది..ఇంతకీ చిరంజీవి చేసిన పనేంటి..ఆయన వల్ల ప్రభాస్ అన్నయ్య అప్పుల పాలు ఎందుకు అయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి వల్ల ప్రభాస్ అన్నయ్య అప్పుల పాలవ్వడానికి కారణం ఏంటంటే.. ప్రస్తుతం ప్రభాస్ అన్నయ్య ఉప్పలపాటి ప్రబోధ్ యు వి క్రియేషన్స్ లో భాగమైన సంగతి మనకు తెలిసిందే.అయితే యూవి క్రియేషన్స్ బ్యానర్లో చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమాకి టీజర్ రాకముందు భారీ హైప్ ఉండేది.కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఆ తర్వాత ఈ సినిమాపై చాలా ట్రోల్స్ వచ్చాయి.ఈ సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేవని విజువల్స్ అస్సలు ఆకట్టుకోవడం లేదని భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాపై మెగా  అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటే కానీ సినిమా మాత్రం అంతగా ఆసక్తికరంగా లేదు అని సినిమా గ్రాఫిక్స్ విజువల్స్ చూసిన చాలామంది మెగా ఫ్యాన్స్ సైతం పదవి విరిచారు. 

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ టీజర్ పై అసహనం వ్యక్తం చేశారట.అలాగే డైరెక్టర్ వశిష్టపై కూడా సీరియస్ అయినట్టు ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి 20 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానార్ లో సినిమా తీయబోతున్నారు కాబట్టి సినిమాపై భారీ హైప్ ఉంది.కానీ టీజర్ వచ్చాక హైప్ అంతా పోయింది. బింబిసారా వంటి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్టతో సినిమా అనేసరికి అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. కానీ విజువల్స్ గ్రాఫిక్స్ అంత బాగా లేకపోవడంతో సినిమా బాగుండదని టాక్ వినిపిస్తోంది. సినిమా గ్రాఫిక్స్ చెత్తగా నాసిరకంగా ఉన్నాయి అని నిర్మాత ఈ విషయంలో డబ్బు ఎక్కువ కాకూడదని లో బడ్జెట్ పెట్టి పిసినారితనం చూపించారని, అందుకే సినిమా అనుకున్నంత రేంజ్ లో టీజర్ రాలేదని టాక్ వినిపించింది.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అవ్వడంతో వెంటనే షూటింగ్స్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోలోకి మార్చేసారట. దాంతో యు వి క్రియేషన్స్ మేకర్స్ అన్నపూర్ణ స్టూడియోలో విశ్వంభర మూవీని తెరకెక్కించడం కారణంగా అన్నపూర్ణ స్టూడియోకి 60 కోట్ల అప్పు కట్టాల్సి ఉందట. ఇప్పటివరకు 60 కోట్ల డబ్బును యూవి క్రియేషన్స్ వాళ్లు కట్టలేదని తెలుస్తోంది.అలా చిరంజీవి విశ్వంభర కారణంగా ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ అన్నపూర్ణ స్టూడియో ఓనర్ అయినటువంటి నాగార్జునకి అప్పు పడినట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: