ఇటు వెంకటేశ్ అటు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజుతో మహేష్ కు మంచి అనుబంధం ఉంది. వెంకటేశ్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన మహేష్ బాబు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో మహేష్ బాబు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ పండగ మూవీ అని ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశామని మహేష్ అన్నారు. హీరోయిన్లు అద్భుతంగా నటించారని నా డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్నారని సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్కొన్నారు. బుల్లిరాజు పాత్రలో నటించిన రేవంత్ తన అద్భుతమైన నటనతో మెప్పించారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇచ్చిన ఈ రివ్యూ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. మహేష్ రివ్యూ ఈ సినిమాకు మరింత బూస్టప్ ఇస్తుందని చెప్పవచ్చు. వెంకటేశ్, మహేశ్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. మహేశ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. మహేష్ బాబు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.