సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రధాన నటీనటులకు సైతం కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే చాలామంది హీరోయిన్లు ఆ అనుభవాల గురించి ప్రస్తావించడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ మాత్రం ఒక హీరోతో లిప్ లాక్ వల్ల తాను వాంతులు చేసుకున్నానంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
 
రవీనా టాండన్ చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. పత్తర్ కే పూల్ అనే మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రవీనా కెరీర్ మొదలైంది. తాను రొమాంటిక్ సీన్స్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని అయితే ఒక హీరో చేసిన పని వల్ల తాను వాంతులు చేసుకోవడంతో పాటు 100సార్లు ముఖం కడుక్కున్నానని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ అనుకోకుండా ఒక హీరో నాకు లిప్ లాక్ ఇచ్చాడని తెలిపారు.
 
ఒక సన్నివేశంలో భాగంగా హీరో నన్ను రఫ్ గా హ్యాండిల్ చేయాలని అయితే ఆ హీరో పెదాలు షూట్ సమయంలో నా పెదాలను తాకాయని రవీనా అన్నారు. ఆ సీన్ లో నిజానికి కిస్ లేదని అయితే ఆ విధంగా జరిగిపోయిందని ఆమె పేర్కొన్నారు. పొరపాటునే లిప్ లాక్ జరిగినా నేను దాన్ని తీసుకోలేకపోయానని ఆ హీరో సైతం నాకు క్షమాపణలు చెప్పారని రవీనా టాండన్ పేర్కొన్నారు.
 
అయితే ఆ ప్రముఖ హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించడానికి మాత్రం రవీనా అస్సలు ఇష్టపడలేదు. కెరీర్ తొలినాళ్లలోనే లిప్ లాక్ సీన్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని ఆ నిర్ణయం వల్ల చాలా మూవీ ఆఫర్లను సైతం కోల్పోయానని ఆమె వెల్లడించారు. రవీనా టాండన్ కూతురు రాషా తడానీ త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నారు. రాషా తడానీ సినిమాల్లో సక్సెస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. నా కూతురికి మాత్రం ఎలాంటి షరతులు పెట్టడం లేదని ఆమెకు ఇష్టం ఉంటే రొమాంటిక్ సీన్స్ లో నటించవచ్చని రవీనా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: