అక్కినేని కోడలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హోదా సంపాదించింది శోభిత దూళిపాళ్ల.. ఒకప్పుడు ఈ హీరోయిన్ ని తెలుగులో ఎవరూ పట్టించుకోలేదట.ఈమె తెలుగమ్మాయే అయినప్పటికీ తెలుగులో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ నుండి హాలీవుడ్ కి కూడా వెళ్ళింది. అలా ఈ ముద్దుగుమ్మ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. ఇక అక్కినేని నాగచైతన్యని ప్రేమించి ఆయనకు రెండో భార్యగా వెళ్లి అక్కినేని కోడలుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా వివాదంలో  చిక్కుకుంది. మరి ఇంతకీ శోభిత చేసిన తప్పేంటి..ఎందుకు ఆమె వివాదంలో ఇరుక్కుంది అనేది ఇప్పుడు చూద్దాం.. శోభిత ధూళిపాళ్ల నాగచైతన్యతో పెళ్లి సమయంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఎన్నో రకాల ఆచార సంప్రదాయాల పాటించి తెలుగింటి కోడలు అంటే ఇలా ఉండాలి అనే విధంగా చేసింది.

 నలుగు పెట్టడం,పెళ్లికూతురుని చేయడం, పసుపు దంచడం వంటి ఇలా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ పెళ్లి సమయంలో చేశారు.దాంతో ఇండస్ట్రీలో ఉండే అసలైన తెలుగింటి కోడలు శోభిత ధూళిపాళ్ల అంటూ ఆమెపై ఎంతో మంది ప్రశంసల వర్షం కురిపించారు. కానీ తాజాగా శోభిత చేసిన పనికి మాత్రం చాలామంది ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ శోభిత చేసిన పనేంటయ్యా అంటే.. తాజాగా శోభిత దూళిపాళ్ల తన కాళ్ళకు ఉన్న మెట్టెలు తీసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో కాళ్ల మెట్టలు తీయడంతో చాలా మంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇన్ని రోజులు నిన్ను తెలుగింటి కోడలు అని ఎంతో గొప్పగా పొగిడాము.

 కానీ నువ్వు మాత్రం సిగ్గు లేకుండా కాళ్ల మెట్టలు తీసేసావు అసలు నువ్వు తెలుగింటి కోడలువేనా అంటూ మండిపడుతున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం శోభిత దూళిపాళ్లకి సపోర్ట్ ఇస్తున్నారు.ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది పెళ్లిళ్లు అయ్యాక మెడలో తాళిబొట్టు కాళ్లకు మెట్టెలు పెట్టుకోరు. ఇక సినిమాలో భాగంగా కాళ్ల మెట్టెలు తీయాల్సి వస్తుంది.ఇందులో శోభిత చేసిన తప్పేంటి..ఇప్పటికే పెళ్లి చేసుకున్న చాలామంది పెద్దపెద్ద సెలబ్రిటీలు కూడా పెళ్లయ్యాక కాళ్లకు మెట్టెలు తీసేసి మెడలో తాళిబొట్టు తీసేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శోభిత ధూళిపాళ్ల మీదే ఎందుకు అంత నెగెటివిటీ అంటూ శోభితకి సపోర్ట్ ఇస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: