ముఖ్యంగా డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అంటూ విషెస్ తెలిపారు. అయితే ఇదే ఈవెంట్లో చిత్ర బృందం ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. సినిమా టికెట్ బుక్ చేసుకున్న వారికి అక్షరాలా రూ.10, 000 గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది.
ముఖ్యంగా మొదటి 100 టికెట్ల బుకింగ్ లో ఒక టికెట్ను ఎంపిక చేసి, ఆ టికెట్ దారుడికి పదివేల రూపాయల క్యాష్ బ్యాక్ కింద నగదు బహుమతి అందిస్తామని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. మమిత బైజు సినిమా కోసం మేకర్స్ ప్రకటించిన ఈ క్యాష్ ప్రైస్ అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఈ ప్రక్రియను వారం రోజులపాటు కొనసాగించనున్నట్లు మేకర్స్ కూడా తెలిపారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీకృష్ణుడికి, ఆయన భక్తుడికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించినట్లు మేకర్స్ తెలియజేశారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని విశ్వ హిందూ పరిషత్తు సభ్యులు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారని మేకర్స్ తెలియజేశారు.