ఇక దీనిపై స్పందించినటువంటి ఊర్వసి రౌతేలా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానిపై నెగిటివ్ పాజిటివ్ కామెంట్లు ఎన్నో వస్తూ ఉంటాయి. దీన్ని నేను అర్థం చేసుకోగలను. ముఖ్యంగా బాలకృష్ణ వంటి స్టార్ హీరోతో పని చేయడం నా అదృష్టం. ఆయనతో వర్క్ చేయడము నేను ఒక గౌరవంగా భావిస్తున్న.. ఇదంతా కలలో భాగమే బాలకృష్ణ డాన్స్ చేయడం కేవలం పెర్ఫార్మెన్స్ కాదు. తనపై నాకున్న గౌరవం, ఆయనతో పనిచేయడం వల్ల నా కల కూడా నెరవేరింది అంటూ చెప్పుకొచ్చింది. ఆయన తన తోటి నటీనటులకు ఎంతో సపోర్ట్ చేస్తారు. ఇక దబిడి దిబిడి పాటకు వేసిన స్టెప్పులపై కూడా రౌతేలా స్పందించింది.
జీవితంలో ఏదీ సాధించలేనటువంటి కొందరు కష్టపడుతూ ముందుకు వెళ్లే వారిని విమర్శిస్తూ ఉంటారు. రియల్ పవర్ అంటే ఇతరులను విమర్శించడం కాదు వారు కూడా ఇతరుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలి అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ కు ఘాటు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే డాకు మహారాజ్ సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో బాలకృష్ణ మరో హిట్ అందుకున్నారని చెప్పవచ్చు.