నంద మూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలం లో వరుస విజయాల తో అద్భుతమై న జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తూ వస్తున్నాడు . బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపా టి శ్రీను దర్శకత్వంలో రూపొంది న అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు . ఆ తర్వాత గోపీ చంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ తో మ రో విజయాన్ని సొం తం చేసుకున్నాడు . ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన భగవంత్ కేసరి సినిమా తో మరో సక్సెస్ ను అందుకున్నాడు . ఇక తాజాగా బాలకృష్ణ , బాబీ దర్శకత్వం లో డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించాడు .

మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే బాలకృష్ణ తన నెక్స్ట్ నాలుగు మూవీ లకు ఇప్పటికే లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య తన నెక్స్ట్ మూవీ ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు. 

మూవీ అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందిపోతుంది. ఈ మూవీ ని అఖండ 2 అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తనకు అద్భుతమైన విజయాలను అందించిన దర్శకులు అయినటువంటి గోపీచంద్ మలినేని , అనిల్ రావిపూడి , బాబి దర్శకత్వంలో తన తదుపరి మూడు మూవీలను బాలయ్య చేయబోతున్నట్లు , ఇప్పటికే అందుకు సంబంధించిన కమిట్మెంట్ లు కూడా జరిగిపోయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: