స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇటీవల గ్రాండ్ గా రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ పరిచయం మసాలా సినిమా సెట్లో జరిగిందట. రానా దగ్గుబాటి వీరిద్దరిని ఒక్కరికీ ఒక్కరినీ పరిచయం చేశారట. ఇక వెంకీ మామకు లంచ్ బ్రేక్ కాస్త లేట్ అయినా కూడా అసహనం వ్యక్తం చేశారట. అలా ఓ సారి రానా సెట్ లో కూడా సిరీస్ అయ్యారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. 
ఈ సినిమాలో హీరోయిన్ లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు భీమ్స్ మంచి మ్యూజిక్ అందించారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. అయితే వెంకీ మామ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ లైన్ కూడా అదిరిపోయింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల విడుదల అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా థియేటర్స్‌లో  బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. దీంతో వరుసగా ఎనిమిదో హిట్ కొట్టేశాడు. అనిల్ రావిపూడి ఎక్కువగా ఫ్యామిలీ ప్రేక్షకులనే టార్గెట్ చేశారు. అందులో ఫ్యామిలీ స్టోరీ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఇలా తెరకెక్కించిన సినిమాలు అన్నీ హిట్లు కొట్టాల్సిందే. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడానివ్వవు. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ అనిల్ రావిపూడి ఫ్యామిలీ డైరెక్టర్ గా నిలిచారు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా అంటే చాలు టాక్ తో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేలా ఫేమ్ క్రియేట్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి ఫ్యామిలీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: