అనుకున్న విధంగానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు కాంపిటీషన్ ఇస్తూ సంక్రాంతి రియల్ విన్నర్ గా బాక్స్ ఆఫీస్ వద్ద నిలిచింది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా . కాగా ఈ సినిమాలో వెంకటేష్ కి భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించింది. వీళ్లిద్దరి కాంబో సూపర్ డూపర్ హిట్ అయింది . ఎంతలా అంటే ఒకప్పుడు వెంకటేష్ పక్కన భార్యగా నటించాలి అంటే అది కేవలం సౌందర్య వల్లే అవుతుంది అని ..సౌందర్య - వెంకటేష్ కాంబో అంత బాగుంటుంది అని జనాలు మాట్లాడుకున్నారు .
సౌందర్య చనిపోయిన తర్వాత వెంకటేష్ పక్కన అంతలా ఏ హీరోయిన్ కూడా సెట్ కాలేదు అని కూడా మాట్లాడుకున్నారు . అయితే చనిపోయిన సౌందర్య ప్లేస్ ని రీప్లేస్ చేయాలి అంటే కచ్చితంగా అది ఐశ్వర్య రాజేష్ వల్లే అవుతుంది అని.. ట్రెసీషనల్ లుక్ లో వెంకటేష్ భార్యగా అదరకొట్టేసింది అని .. ఇక వీళ్ళ కాంబోలో సినిమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ తెగ కామెంట్స్ చేసేస్తున్నారు . అంతేకాదు అన్ స్టాపబుల్ షో లోను వెంకటేష్ .. సౌందర్యతో నటించడం పై స్పందించారు . మా కాంబో సూపర్ డూపర్ హిట్ అంటూ సౌందర్యం ని ఓ రేంజ్ లో పొగిడేసారు..!