తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం ఆయన చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన 8 సినిమాలకు ఎనిమిది సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలవడంతో 100% సక్సెస్ రేట్ ని సాధించిన దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ఆయన సినిమాల్లో చాలా ఎక్కువ ఫన్ ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు. అందుకోసమే ఆయన సినిమాలను చూడడానికి యావత్ ప్రేక్షకులంతా సిద్ధంగా ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

ఇక ప్రస్తుతం ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న నేపధ్యం లో మెగాస్టార్ చిరంజీవి అతనికి ఫోన్ చేసి అతనికి కంగ్రాట్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తర్వాత చిరంజీవితో చేయబోయే సినిమా కోసం ఎంచుకున్న కథ గురించి కూడా చిరంజీవి అడిగి తెలుసుకుని అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది.అలాగే మూవీ స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదని అనిల్ చెప్పారు. అలాగే చిరంజీవి గారు ఒప్పుకుంటే ఘరానామొగుడు,రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ లు రాస్తానని అనిల్ తెలిపారు.ఇదే నిజమైతే వింటేజ్ చిరుని చూస్తామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.మరి ఏది ఏమైనా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు చేస్తున్న సినిమా యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడం అనేది అనిల్ రావిపూడి కలగా ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశాడు.మరి ఎట్టకేలకు ఆయన చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: