నాగచైతన్య.. నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు . సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అయినట్లు తెలుస్తుంది . మొదటగా హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకుని.. సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేసి పడేసిన నాగచైతన్య.. ఆ తర్వాత సమంతకు విడాకులు ఇచ్చేసి మరి హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ టైంలో సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఘాటుగా మండిపడ్డారు . సమంత కూడా పరోక్షంగా చాలా సార్లు ఫైర్ అయ్యింది .


అయితే సమంతది నిజమైన లవ్ అని ..నాగ చైతన్య ది డూప్లికేట్ ప్రేమ అంటూ చాలామంది ట్రోల్ చేశారు.  కాగా రీసెంట్గా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల సంక్రాంతి సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.  దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. కొందరు శోభిత ధూళిపాళ్ల మెట్టెలు పెట్టుకోలేదు అని బూతు పదాలతో ట్రోల్ చేశారు . అయితే ఇదే క్రమంలో నాగచైతన్య - శోభితతో ఉన్న ఒక స్పెషల్ పిక్చర్ ని షేర్ చేస్తూ 'మై విశాఖ క్వీన్' అంటూ రాసుకొచ్చాడు.



దీంతో సోషల్ మీడియాలో అందరూ ఈ జంటను చూసి వామ్మో ఇదేం ప్రేమ రా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . "విశాఖ క్వీన్ శోభిత ధూళిపాళ్ల మాత్రమేనా..? విశాఖలో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు .. కళ్ళు తెరిచి చూసుకో నాగచైఅతన్య" అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . మరి కొందరు 'నువ్వు ముద్దుగా నీ భార్యని క్వీన్ అని పిలుస్తావా..?" అంటూ ఈ పిక్చర్స్ ని ట్రెండ్ చేస్తున్నారు.  మొత్తానికి నాగచైతన్య పై అటు పాజిటివ్గా ఇటు నెగటివ్గా రెండు విధాల ట్రోలింగ్ జరుగుతుంది . నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల  జంటపై ఫోకస్ చేశారు జనాలు. కాగా ఈ జంట చూడడానికి చక్కగా నే ఉన్న కానీ ఎందుకో పెళ్లి తర్వాత నాగచైతన్య హ్యాపీగా లేడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . పెళ్లి సమయంలోను మొక్కుబడిగానే నవ్వాడు తప్పిస్తే ఎక్కడ మనస్పూర్తిగా నవ్వలేదు అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: