యంగ్ హీరో తేజా సజ్జా గురించి ప్రేత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తేజ సజ్జ.గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్ కి రెడీ అయిపోయాడు. ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడు తేజ. గతంలో రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు. కార్తీక్ ఘట్టమనేని.ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా న్యూ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ క్రమంలో నే గత సంక్రాంతి నుండి నా ప్రయాణం ఎగురుతూ ప్రారంభమైంది.ఇంకా మీ ప్రేమతో అది కొనసాగుతోంది,లేగండి లేచి ఆకాశంలో గాలిపటాల్లా ఎగురుదాం మా సూపర్ యోధా లాగానే గాలిపటంలా ఎగరండి అంటూ క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన పోస్టర్‌లో తేజ గాలిలో ఎగురుతూ కనిపిస్తాడు.

సూపర్ హీరో రేంజ్‌లో ఈ పోస్టర్ వైరల్ అవుతుండగాసినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాగా ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇదిలావుండగా మిరాయ్ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌ 18న తెలుగుతో పాటు అన్ని పాన్‌ ఇండియా భాషల్లోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.హిందూ దేవాలయం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం అందుతోంది. సూపర్‌ హీరో కాన్సెప్ట్‌తో తెలుగులో వచ్చిన సినిమాలకు మంచి స్పందన దక్కుతున్న ఈ సమయంలో దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని మరోసారి అదే తరహా కాన్సెప్ట్‌తో రాబోతున్న నేపథ్యంలో సక్సెస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా పోస్టర్స్‌తో పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేస్తున్నారు. అంచనాలు భారీగా పెరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: