నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల్లో విలన్ పాత్రలకు అద్భుతమైన ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. దానితో బాలకృష్ణ సినిమాల్లో విలన్ గా అవకాశం వస్తే చాలా మంది ఎంతో ఆనందంతో ఆ పాత్రలను చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బాలకృష్ణ హీరో గా రూపొందే సినిమాల్లో ఇతర ఇండస్ట్రీలలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు విలన్ పాత్రలలో నటిస్తూ వస్తున్నారు. బాలయ్య కొంత కాలం క్రితం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే బాలయ్య కొంత కాలం క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు. ఇలా ఈ మధ్య కాలంలో బాలయ్య హీరో గా రూపొందుతున్న సినిమాల్లో ఇతర ఇండస్ట్రీ లలో మంచి గుర్తింపు కలిగిన నటులు విలన్ పాత్రలలో నటిస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: