ఈ సినిమాకు సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉందని భోగట్టా. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. వీరసింహారెడ్డి బాలయ్య అభిమానులకు నచ్చగా ఈ సినిమా ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేసింది. బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బాలయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తుండటంతో ఆయన డైరెక్షన్ లో నటించడానికి హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య వరుసగా 4 విజయాలను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తోంది. అఖండ2 సినిమా బాలయ్య రేంజ్ ను పెంచే సినిమా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటూ ఉండగా సీనియర్ హీరోలలో బాలయ్య రేంజ్, క్రేజ్ వేరు అని చెప్పవచ్చు. బాలయ్య ఇతర భాషల్లో సైతం సంచలన విజయాలను సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. బాలయ్య కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.