తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో చిరు , బాలయ్య , వెంకీ , నాగ్ అంటారు. మరి వీరు నలుగురు తాము నటించిన ఎన్నో సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల చేశారు. ఇకపోతే 2016 నుండి 2025 వరకు వీరు నటించిన సినిమాలలో ఏ సినిమాలు సంక్రాంతి విన్నర్ గా నిలిచాయి అనే వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి : చిరంజీవి 2017 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఆ సంవర్త్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక చిరంజీవి 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ సంవత్సరం చిరంజీవి "వాల్టేరు వీరయ్య" సినిమాతో సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.

బాలకృష్ణ : బాలకృష్ణ 2018 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జై సింహా అనే మూవీ తో బరిలో నిలిచి మంచి కలెక్షన్లను వసూలు చేసి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.

నాగార్జున : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున 2016 వ సంవత్సరం సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి భారీ విజయాన్ని అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఇక 2020 వ సంవత్సరం బంగార్రాజు సినిమాతో సంక్రాంతి రేసులోకి దిగిన నాగార్జున ఆ సంవత్సరం కూడా సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.

వెంకటేష్ : 2019 వ సంవత్సరం వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 సినిమా విడుదల అయింది. ఈ సినిమా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇకపోతే 2025 వ సంవత్సరం వెంకటేష్ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం ఈ సినిమానే సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అని జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: