టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే . ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుండి ఆదుకునే ఆయన.. నష్టం జరిగినప్పుడు కచ్చితంగా స్పందిస్తారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి జరిగిందని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తన అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా ఒక ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సైఫ్ అలీ ఖాన్ పై పలుమార్లు కత్తితో దాడి చేసినట్లు వైద్యులు నిర్ధారించగా ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

ఇక ఇది చిరంజీవి వరకు చేరడంతో ఆయన ట్విట్టర్ వేదికగా.. సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడి అనే వార్త కారణంగా నేను మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర  సినిమా చేస్తున్నారు. ఏడాది సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమా పోస్టు పోన్ అవడానికి కారణం చిరంజీవి అని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఆయనకు చికెన్ గున్యా వ్యాధి రావడంతో గత కొన్నాళ్లుగా కీళ్ల నొప్పులతో బాధపడిన ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొనలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం పెండింగ్లో ఉన్న షూటింగ్ కాస్త వాయిదా వేశారు.

ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్లో పాల్గొంటున్న చిరంజీవి మే లోపు సినిమా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల , అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: