పుష్ప-3 ది ర్యాంపేజ్‌ పేరుతో కొత్త సినిమా తెరకెక్కున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అటు అల్లు అర్జున్‌, ఇటు సుకుమార్‌ ఇప్పటికే వేర్వేరు ప్రాజెక్టులు ఖరారు చేశారు. ఇప్పటికే సుకుమార్‌, రామ్‌ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించారు. అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించనున్నారు. బన్నీతో సినిమాలు చేసేందుకు మరికొందరు దర్శకులు సంప్రదించినట్టు సినీ వర్గాల సమాచారం. ఇవి పూర్తయ్యాక పుష్ప-3ని పట్టాలెక్కిస్తారా అనేది చూడాలి.ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ పుష్ప-3 అప్‌డేట్‌ ఇచ్చారు.పుష్ప 2ఘన విజయం అందుకున్న  సందర్భంగా తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవిశ్రీ సీక్వెల్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.పుష్ప-3 కోసం సుకుమార్ నిరంతరం పనిచేస్తున్నారని DSP వెల్లడించారు. స్టోరీపై రీవర్క్ కూడా జరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పుష్ప-2లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ప్రతి టెక్నీషియన్ బాగా కష్టపడ్డారు. వర్క్ విషయంలో నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడికి గురైతే క్రియేటివిటీ ఉండదు. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి.

రెండు పార్టుల కోసం కష్టపడినట్లుగానే పుష్ప-3 కోసం పనిచేస్తాం అని తెలిపారు.ఇదిలావుండగా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్‌ చేయబోతున్న సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే మరో సారి వీరి కాంబో లో మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక దర్శకుడితో పదే పదే సినిమాలు చేయడం అల్లు అర్జున్‌కి అలవాటు. అందుకే పుష్ప ప్రాంచైజీ సినిమాలు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిట్ అయినన్ని రోజులు పుష్ప ను తీసుకు రావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటూ ఉన్నారు. హాలీవుడ్‌ లో బాండ్‌ తరహా ప్రాంచైజీ సినిమాలు వస్తూ ఉంటాయి. అలా టాలీవుడ్‌లో ముందు ముందు పుష్ప ప్రాంచైజీ సినిమాలు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: