టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ జే సూర్యమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలలో నటించాడు.

చరణ్ ఈ మూవీ లో ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్ కు జోడిగా అంజలి నటించగా ... కొడుకు పాత్రలో నటించిన చరణ్ జోడిగా కియార అద్వానీ నటించింది. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ జనవరి 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు దగ్గర దక్కడం లేదు. ఇలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అనుకున్న స్థాయి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టకపోవడంతో మెగా ఫాన్స్ కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా అనుకున్న స్థాయి రిజల్ట్ ను రాబట్టకపోకటం కంటే కూడా మరో విషయంలో మెగా ఫాన్స్ తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... శంకర్ "గేమ్ చేంజర్" సంవత్సరాల క్రితం మొదలు పెట్టాడు. చాలా లేట్ గా ఈ మూవీ ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఆయన ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. దానితో మెగా ఫ్యాన్స్ కనీసం శంకర్ ఈ సినిమాను స్పీడుగా పూర్తి చేసి విడుదల చేసి ఉంటే మా హీరో ఇంకో సినిమాతో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేవాడు. కానీ ఈ సినిమా షూటింగ్ ను చాలా స్లో గా చేస్తూ వచ్చాడు. చివరకు సినిమా బోల్తా కొట్టింది. మా హీరో సమయం అంతా వృధా అయ్యింది అనే విషయంలో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: