విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. దానికి తగినట్టుగానే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాను చూడడానికి అభిమానులు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. 

మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా.... ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్య పాత్రలో అద్భుతంగా నటించింది. వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలైన మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. ఇందులో దిల్ రాజు, వెంకటేష్, అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పాల్గొన్నారు.


కాగా, ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన  రెండు రోజుల్లోనే రూ. 77 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈరోజు కూడా బుక్ మై షోలో వేల సంఖ్యలో టికెట్స్ బుక్ అవడంతో రూ. 1000 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వెంకటేష్ కుటుంబం చేసిన కామెడీ అతని కొడుకు పాత్రలో నటించిన బుల్లి రాజు అభిమానులను ఆకట్టుకున్నారు.


సంక్రాంతి కానుకగా బాలయ్య బాబు నటించిన డాకు మహారాజు, రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమాల కన్నా వెంకటేష్ నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. కాగా, ఈ సినిమా వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: