టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే నాగార్జున కెరియర్ లో కొన్ని సినిమాలకు విడుదల అయిన తర్వాత నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత మళ్లీ మెల్లిగా పంచుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలలో అల్లరి అల్లుడు మూవీ ఒకటి. నాగార్జున హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆ సమయంలో స్టార్ హీరోయిన్ లుగా కెరీర్ ను కొనసాగిస్తున్న నగ్మా , మీనా హీరోయిన్లుగా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. 1993 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమాకు మొదట నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత మెల్లి మెల్లిగా పుంజుకొని ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి చివరగా ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా ఆ సమయంలో ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసింది. ఏ స్థాయి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 7.20 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి , 1993 వ సంవత్సరంలో టాప్ గ్రాసర్ గా ఆల్ టైం టాప్ 4 మూవీ గా నిలిచింది. అలాగే ఈ సినిమా ఏకంగా 22 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది. నెగిటివ్ టాక్ తో మొదలై అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా 1993 వ సంవత్సరం అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాల్లో లిస్టులో నిలవడం మాత్రమే కాకుండా ఏకంగా 22 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడి మంచి రికార్డును సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో నాగార్జున తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా , నగ్మా , మీనా తన నటనలతో పాటు అందాలతో కూడా ప్రేక్షకులను సూపర్ గా అలరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: