తర్వాత కృష్ణంరాజు చిలకగోరింక సినిమాలో హీరోగా ఎంపికైన ఆ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఈ క్రమంలోనే తర్వాత మళ్లీ కృష్ణంరాజు చాలా కాలం పాటు చిన్న చిన్న సినిమాల్లో నటించాల్సి వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న క్రమంలోనే.. విలన్‌గాను అవకాశాలు దక్కించుకున్న కృష్ణంరాజు.. కృష్ణ హీరోగా నటించిన నేనంటే నేనే సినిమాలో విలన్ గా కనిపించాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అందరూ స్టార్ హీరోల సినిమాలను.. కృష్ణంరాజు విలన్‌గా సెకండ్ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. దాదాపు 8 ఏళ్ల వరకు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఆయన కృష్ణవేణి.. సినిమాతో హిట్ అందుకున్న సరైన ఫేమ్ రాలేదు. తర్వాత వచ్చిన పరివర్తన సినిమా బాగానే ఆడిన.. బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ క్రమంలోనే వచ్చిన భక్తకన్నప్ప సినిమాతో కృష్ణంరాజు సంచలనం సృష్టించాడు.
ఈ సినిమా తర్వాత హీరోగా మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇక అప్పటికే కృష్ణ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. బిజీబిజీగా సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఇక భక్తకన్నప్ప బ్రేక్‌తో స్టార్ అయిన కృష్ణంరాజు.. సూపర్ స్టార్ కృష్ణ పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు పోటీ పోటీగా సినిమాలు చేశారు. అమరదీపం, జీవన తరంగాలతో కృష్ణంరాజు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కటకటాల రుద్రయ్యతో తిరగలేని సూపర్ స్టార్ గా మారాడు. ఇక ఆ సమయంలో కృష్ణ, శోభన్ బాబులకేకాదు.. ఎన్టీఆర్, ఏఎన్నార్లకు కూడా కృష్ణంరాజు మంచి కాంపిటీషన్ ఇచ్చారు. తనకంటూ గొప్ప ఇమేజ్ను స్టార్‌డంను దక్కించుకున్నారు. ఐదున్నర దశాబ్ధాలుగా నటుడిగా ఇండస్ట్రీలో రాణించాడు. రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన వారసుడుగా ప్రభాస్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.