మన్యంలో మొనగాడు : అర్జున్ హీరో గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కోడి రామకృష్ణ మొదట చిరంజీవి తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను వివరించగా ఆయన మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఆఖరి పోరాటం : నాగార్జున , శ్రీదేవి జంటగా రూపొందిన ఈ సినిమాను కే రాఘవేందర్రావు రూపొందించాడు. ఈ సినిమాను మొదట చిరంజీవి తో చేయాలి అని మేకర్స్ అనుకున్న చిరంజీవి కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
నెంబర్ వన్ : సూపర్ స్టార్ కృష్ణ హీరో గా రూపొందిన ఈ సినిమాను మొదట చిరంజీవితో చేయాలి అనుకున్నారట. ఆయన ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అసెంబ్లీ రౌడీ : మోహన్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాను చిరంజీవి తో చేయాలి అని మొదట మేకర్స్ అనుకున్నారట. కానీ ఆయన మాత్రం ఈ సినిమా కథను కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
ఇలా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో వదిలేసిన ఈ నాలుగు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.