నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ నటవారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసస్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆయన.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలయ్య.. తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అలా తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనితరసాధ్యమైన ఎన్నో రేర్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. ఇక బాలయ్య తాతమ్మకల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన్న సంగతి తెలిసిందే. సాహసమే సినిమాతో హీరోగా మారి తన నటనతో ఆకట్టుకున్నాడు.
 

ఇక తన సినీ కెరీర్‌లో సైన్స్‌ఫ్రిక్షన్, బయోగ్రఫీ, సాంగీకం, జానపదం, పౌరాణికం ఇలా దాదాపు అన్ని జానర్ల‌లో నటించి మెప్పించాడు. ఇప్పటివరకు ఇన్ని జానర్ లో నటించిన ఏకైక టాలీవుడ్ హీరో బాలయ్య కావడం విశేషం. కేవలం బాలయ్యకు మాత్రమే ఈ రికార్డ్స్ సొంతమైంది. ఇక 1987లో బాలయ్య నటించిన 8 సినిమాలు రిలీజ్ అయి దాదాపు అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి. 17 సినిమాల్లో దీపాత్రాభినయం చేసిన బాలయ్య.. అధినాయకుడు సినిమాల్లో ట్రిపుల్ రోల్ లోను నటించాడు. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో ఏకంగా 13 సినిమాల్లో హీరోగా కనిపించారు. ఇక‌ బాలయ్య తన సినీ కెరీర్ లో రెండు సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు తానే స్వయంగా దర్శకత్వం వహించారట.

 

ఆ సినిమాలేవో కాదు.. పెద్దన్నయ్య, గౌతమీపుత్ర శాతకర్ణి. పెద్దన్నయ్య సినిమాల్లో క్లైమాక్స్ కు దర్శకత్వం వహించిన బాలయ్య.. గౌతమీపుత్ర శాతకర్ణిలో చాలా సన్నివేశాలను తానే తెర‌క్కించారట. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య ఆదిత్య 999 మాక్స్ పేరుతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా బాల‌య్య త‌న‌యుడు మోక్షజ్ఞను హీరోగా పెట్టి తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక తాజాగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉండబోతుందంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా తర్వాత బాలయ్య ఆదిత్య 999 మోక్షజ్ఞతో తెర‌కెక్కిస్తార‌ని టాక్‌. అయితే ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్‌లో.. నాగవంశీ ప్రొడ్యూసర్గా జనవరి 12న సంక్రాంతి బ‌రిలో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: