టాలీవుడ్ ద గ్రేట్ లెజెండ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు సినిమాలో హీరోగా కనిపించారు. నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఏకంగా 40 ఏళ్ళ సమయం పట్టింది. ఆ గ్యాప్ లో మూడు తరాల హీరోలు టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటికే ఏఎన్ఆర్ పలు సినిమాల్లో క్యారెట్ రోల్స్, తాత పాత్రలోనూ కూడా కనిపించారు. ఇంతకీ ఆ సినిమా అప్పటివరకు రిలీజ్ కాకపోవడానికి వెనుక చాలా పెద్ద కారణమే ఉందట. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో ఏఎన్ఆర్, జయసుధ, తులసి హీరో, హీరోయిన్‌లుగా కనిపించిన ఈ సినిమాను జాగర్లమూడి రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేశారు. అయితే అప్పట్లో అంత పెద్ద స్టార్‌డం ఉన్న ఏఎన్ఆర్ సినిమా రిలీజ్ కాకపోవడానికి అంత పెద్ద సమస్య ఏమై ఉంటుంది అనే డౌట్ అందరికీ ఉంటుంది.
అయితే ఈ సినిమాకు హీరో, హీరోయిన్లను ఫిక్స్ చేసి షూటింగ్ మొదలుపెట్టి సగం సినిమా పూర్తి అయిన తర్వాత మధ్యలో నాగేశ్వరరావుకు హార్ట్ ఎటాక్ వచ్చిందట. వెంటనే.. ఆయనకు సర్జరీ చేయాలన్నారు. సర్జరీ నుంచి కోలుకొని ఆయన సెట్స్‌లోకి రావడానికి చాలా సమయం పట్టింది. దీంతో వేరే స్కెడ్యూల్ తో బిజీగా ఉన్న డైరెక్టర్ సంగీతం.. సినిమా నుంచి తప్పుకున్నారట. దీంతో రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్ రావు సినిమా బాధ్యతలు తీసుకుని ఎలాగోలా సినిమాను పూర్తి చేసేశారు. కానీ.. అప్పటికి నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే సినిమాను రిలీజ్ చేయలేకపోయాడట. అలా మురుగున పడిన ప్రతిబింబాలు.. 2022 నవంబర్ 5న ఏఎన్ఆర్ జయంతినాడు 250 పైగా థియేటర్లో కలర్ ప్రింట్ తో రిలీజ్ చేశారు. ఈ సినిమా కాస్త టెక్నాలజీని యాడ్ చేసి ప్రమోషన్స్ ఎక్కువగా జరగకపోవడం.. మరిన్ని కారణాలతో సినిమా ఆడియన్స్ వరకు చేరలేదు.