మొదట ఎన్టీఆర్ తో కలిసి రాఘవేందర్రావు డైరెక్షన్‌లో తిరుగులేని మనిషి సినిమాలో నటించానని.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిలైంది.. వెంటనే ఆయనతో మరో సినిమా కోసం ఓ దిగ్గజ డైరెక్టర్ నన్ను బుక్ చేశారు. వెంటనే ఎంతో సంతోషించా.. మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా అని చాలా ఆనందపడ్డ. సినిమా కోసం అన్ని సిద్ధం చేసుకున్న కానీ.. తన పేరు లేకుండా మూవీ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరో హీరోని తీసుకున్నారు అని తెలిసింది. షూటింగ్ అవుతుంది కానీ నాకు చెప్పడం లేదు.. దీంతో ఆ మూవీ నిర్మాతని విషయం అడిగా. ఆయన అసలు మ్యాటర్ చెప్పారు. మొదట ఎన్టీఆర్‌తో మీరు చేసిన మూవీ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు మళ్ళీ అదే కాంబో రిపీట్ అయితే నెగటివ్ ఇమేజ్ వస్తుంది.. అందుకే వేరే హీరోని తీసుకున్నామని వాళ్లు సమాధానం ఇచ్చారు.
అదే విషయం ముందు చెప్పచ్చు కదా అని నేను అడిగితే ఎలా చెప్పాలో అర్థం కాలేదు.. బాధపడతారని ఆలోచించామంటూ వివరించారట. వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటతో ఎంతగానో కృంగిపోయా.. చాలా లో అయిపోయా.. తనతో సినిమా చేస్తే ఫ్లాప్ అవుతున్నాయని కామెంట్ విస్తరిస్తుందేమోనని చాలా భయపడిపోయా అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఐరన్ లెగ్ గా ముద్ర వేస్తారని ఆవేదన చెందినట్లు వివరించాడు. తర్వాత నేను అనుకున్న లక్ష్యంతో.. నా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నానని.. ఆ తర్వాత అదే డైరెక్టర్ నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని అలా వాళ్ళకి టచ్ లో ఉన్నానని వినయంగా వ్యవహరించాలని వివరించాడు. అయితే చిరంజీవి కెరీర్ లో అప్పట్లోనే అత్యధిక సినిమాలు తెరకెక్కించింది రాఘవేంద్రరావు. మరి ఎన్టీఆర్‌తో కలిసి చేసే సినిమా నుంచి చిరుని తీసేసింది కూడా ఆయనేనంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సినిమా ఆయన వెంటనే.. ఎన్టీఆర్ కొండవీటి సింహం సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మోహన్ బాబు ఆకట్టుకున్నారు. చిరు చెప్పిన ఆ సినిమా ఇదే అంటూ ప్రస్తుతం న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది.