నందమూరి నట‌సింహం బాలకృష్ణకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తారన్న సంగతి తెలిసిందే. బలయ్య‌కు ఓ కథ నచ్చి దర్శకుడు నమ్మితే.. ఇక వేరే ఆలోచన లేకుండా డైరెక్టర్ ఏది చెప్తే అది చేసేస్తారు. సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా.. ఆయన తన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం హ్యాట్రిక్‌తో మంచి స్వింగ్‌లో ఉన్న బాలయ్య.. త్వరలోనే డాకు మహారాజ్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించనున్న‌ సంగతి తెలిసిందే.
 

యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న క్రమంలో.. బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైర‌ల్‌గా మారుతుంది. బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాల్లో కథానాయకుడు సినిమా కూడా ఒకటి. 1984లో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను బాలయ్య కంటే ముందు.. ఏకంగా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆరుగురు హీరోలు రిజెక్ట్ చేశారంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది.

 

వారిలో చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులు కూడా ఉన్నారట. అయితే ఈ ఆరుగురు హీరోలు వద్దని రిజెక్ట్ చేసిన సినిమాను బాలయ్య కథ నచ్చడంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించే ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. కే. మురళి మోహన్ దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. అలా కథానాయకుడు సినిమా బాలయ్య కెరీర్‌లోనే సో స్పెషల్ మూవీ గా నిలిచిపోయింది. కొనేళ్ల క్రితం బాలయ్య తండ్రి ఎన్టీఆర్ జీవితగాధ‌ ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటించగా.. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కథానాయకుడు అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందించారు. అయితే.. ఈ సినిమా సక్సెస్ అందుకోలేదు. తాజాగా బాలయ్య నుంచి రిలీజ్ అయిన డాకు మహారాజ్ బాక్స్ ఆఫీస్‌లో రికార్డ్ సృష్టించాల‌ని కలెక్షన్ల పరంగా సంచ‌ల‌నాలు సీష్టించాల‌ని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: