అయితే బాహుబలి సినిమాలో శివగామి దేవి పాత్రలో మెరిసిన రమ్యకృష్ణ ఒక పసిబిడ్డను చేతులతో పైకి ఎత్తుకొని ఉండే షాట్ బాగా వైరల్ గా మారింది . బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలిని నీటిలో మునగనికుండా పైకి లేపు ప్రాణాలు కోల్పోతుంది రమ్య కృష్ణ. ఆ సీన్ ఎప్పటికీ మర్చిపోలేం . ఇప్పటికీ చాలామంది తమ పుట్టిన బిడ్డలను ఆ విధంగా స్టిల్స్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు . కాగా బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలి చిన్నప్పటి పాత్రలో నటించిన పాపకి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి .
ఆ పాప పేరు తన్వి . నెలల వయసులోనే వెండితెరపై మెరిసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. స్కూల్లో చదువుకుంటుంది . తన్వితో దిగిన ఫొటోస్ కొందరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఆ ఫోటోలను వైరల్ అవుతున్నాయి. సో క్యూట్ అంటూ సో బబ్లీ అంటూ ఆమె ఫొటోస్ ను ట్రెండ్ చేస్తున్నారు జనాలు . తన్వి భవిష్యత్తులో గొప్ప నటి అవుతుంది అంటూ ఆశీర్వదిస్తున్నారు. ఆమె కి సంబంధంచిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..!