టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కానీ ఈ కుటుంబంలో ఆస్తి గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మంచు మనోజ్ మాత్రం తాను ఆస్తి కోసం గొడవ పడడం లేదని, మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అవకతవకల గురించి ప్రశ్నిస్తుంటే, తనపై దాడి చేస్తున్నారని మీడియాతో చెప్పుకొచ్చారు.

ఇక ఇదిలా ఉండగా తన కూతురు పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో హైదరాబాదులోని మోహన్ బాబు యూనివర్సిటీలో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు మంచు మనోజ్ దంపతులు. అందులో భాగంగానే తమ పిల్లలతో తిరుపతి చేరుకున్నారు. ఇక తర్వాత నారావారి పల్లెలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లను కలిసిన వీరు, ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే మళ్లీ తమపై దాడి చేయడానికి ఈ జంట వచ్చింది అని మోహన్ బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

అయితే ఆ తర్వాత మంచు మనోజ్ కూడా చంద్రగిరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో.. ప్రశ్నిస్తుంటే, తనపై కావాలని కంప్లైంట్ చేస్తున్నారని తాను గొడవపడడానికి రాలేదని సంక్రాంతి పండుగ చేసుకోవడానికి వచ్చాను అని తన తండ్రిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  ఇక ఫిర్యాదు చేసిన తర్వాత చంద్రగిరి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడ్డారు. ఇక వెంటనే హుటాహుటిన అక్కడి నుండి వెళ్ళిపోయారు మంచు మనోజ్. ఇక భర్త బాధపడే తీరును చూసి ఆయన భార్య మౌనిక మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే మంచు కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పేరిట విద్యార్థుల నెత్తిన రుద్దుతున్నారు అంటూ మంచు మనోజ్ ప్రశ్నిస్తున్నారు.  ముఖ్యంగా విద్యార్థులకు, లోకల్ ప్రజలకు,  అభిమానులకు అండగా ఉంటానని తెలిపారు మంచు మనోజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: