ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న వార్త సైఫ్ అలీఖాన్ పై హత్యాయత్నం.. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆయనపై ఆరుసార్లు కత్తితో పొడిచారు.దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.అసలు సైఫ్ అలీ ఖాన్ చేసిన తప్పేంటి..ఆయనను ఎవరో ఇంటికి వచ్చి మరీ కత్తితో పొడిచి వెళ్లడం ఏంటి అని చాలామంది అయోమయంలో పడిపోయారు. అయితే సైఫ్ అలీ ఖాన్ పై హత్యాయత్నం లో నిమిషానికి ఒక వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా కరీనాకపూర్,సైఫ్ అలీ ఖాన్ సన్నిహితులు స్పందించి ఈ సమయంలో అభిమానులు సంయమనం పాటించాలని, హత్యాయత్నం చేసిన వారి గురించి పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారని చెప్పుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టినట్టు బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు అన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఇంట్లోకి ఎవరు వచ్చినట్లు లేరని, ఇంట్లో ఉన్న వాళ్లే ఈ పని చేసినట్టు నిర్ధారించారట. అలాగే సైఫ్ అలీఖాన్ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో ఎవరు వచ్చినట్లు లేకపోవడంతో ఇంట్లో వారి పనేనా అనే కోణంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళందరినీ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సైఫ్ అలీఖాన్ ఉండే దగ్గర ఉండే అపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు.. ఎవరితోనైనా ఈ హీరోకి గొడవలు ఉన్నాయా.. అనే కోణంలో కూడా విచారిస్తున్నారట. 

అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పని చేసే వాళ్ళు ఎప్పటినుండి పని చేస్తున్నారు.. వారితో సైఫ్ ఈ మధ్యకాలంలో ఏమైనా గొడవలు పడ్డారా..అని ఇలా అన్ని విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ చికిత్స పూర్తయి ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక ఆయన దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారట పోలీసులు. అలాగే కరీనాకపూర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి విచారణ జరపబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు సిసి కెమెరాలు చూస్తే మాత్రం ఇంట్లో ఉండే వాళ్లే ఈ పని చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: