దివంగత నటి ది గ్రేట్ రాజకీయ నాయకురాలు అయినటువంటి జయలలితకి తమిళ హీరో అజిత్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. నా తర్వాత నా రాజకీయ వారసుడు నువ్వే అంటూ అజిత్ ని జయలలిత అనడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి.. అసలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. తమిళ్ నటుడు అజిత్ రీసెంట్ గా దేశం గర్వించదగ్గ పనిచేశారు. దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ లో మూడో స్థానంలో నిలిచి దేశం పేరుని ప్రపంచం నలుమూలల పొగిడేలా చేశారు. అయితే అలాంటి అజిత్ ఓవైపు సినిమాలు చేస్తేనే మరోవైపు కార్ రేసింగ్ ని చాలా ఇష్టంగా చూస్తారు.అయితే తమిళ నటుడు అజిత్ కి ఫ్యాన్స్ క్లబ్ అంటే కూడా ఇష్టం ఉండదు. ఆయన తన ఫ్యాన్స్ క్లబ్ ని కూడా రద్దు చేసేసారు. అయితే తమిళ సీనియర్ నటి తమిళనాడు మాజి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత అజిత్ ప్రవర్తనని మెచ్చి నీలో చిత్తశుద్ధి సామాన్య ప్రజలను ప్రేమించే గుణం ఎక్కువగా ఉంది.

అందుకే మీరు అంటే నాకు ఎనలేని అభిమానం  మీరు వెంటనే అన్నా డిఎంకె పార్టీలో చేరండి అంటూ అజిత్ కి చెప్పిందట.కానీ అజిత్ మాత్రం నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను నన్ను రాజకీయాల్లోకి లాగకండి అని జయలలితకు చాలా సార్లు చెప్పారట.. కానీ జయలలిత  మాత్రం అజిత్ దగ్గరికి వెళ్లి నా తర్వాత అన్నాడీఎంకే పార్టీని నడిపించే వారసుడిగా మీరే ఉండాలి అని నా తర్వాత మీ నాయకత్వంలోనే ఈ పార్టీ నడవాలి అని కోరుకుందట. కానీ దానికి అజిత్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని రాజకీయాల్లో జోక్యం చేసుకోనని, భారతీయుడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పారట.

అయితే జయలలిత అజిత్ ని చాలా సందర్భాలలో మెచ్చుకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏ రిపోర్టర్ అయితే అజిత్ ని నపుంసకుడు అని పదేపదే వార్తాపత్రికల్లో ఆయన పేరును ఉపయోగిస్తూ ఆయన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో అలాంటి ఆయనే హాస్పిటల్ కి వెళ్లి మరీ రెండు లక్షల సహాయం చేసి ఆయన్ని బ్రతికించారు. ఇక ఈయనలో ఉన్న ఈ గుణం కూడా జయలలిత కి చాలా నచ్చిందట. అందుకే జయలలిత అజిత్ ని చాలా అభిమానించేదట.అంతేకాదు తన పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ అజిత్ రాజకీయాల్లోకి రానని ఎవరి పార్టీలోకి కూడా వెళ్లలేదని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: