అయితే రామ్ చరణ్ మాత్రం నాకే సంబంధం లేదు అంటూ ఒక నోట్ రిలీజ్ చేసి అభిమానుల ప్రామిస్ నిలబెట్టుకుంటాను అన్నట్లు చేతులు దులిపేసుకున్నాడు . అయితే అటు శంకర్ ఇటు రాంచరణ్ ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు . ఇప్పుడు చిక్కంతా వచ్చింది బుచ్చిబాబుకి. 'ఉప్పెన' సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి రాంచరణ్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో 'జాన్వి కపూర్' హీరోయిన్గా వర్క్ చేస్తుంది . అయితే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు మెగా అభిమానులు . గేమ్ చేంజర్ ఎలాగో ఫ్లాప్ అయింది . కనీసం ఈ సినిమా అయినా హిట్టయితే మళ్లీ రాంచరణ్ కి పునర్ వైభవం అందుతుంది అంటూ ఆశపడుతున్నారు .
అయితే ఇప్పుడు ప్రెజర్ బుచ్చిబాబుపై ఎక్కువ పడిపోయింది అంటున్నారు సినీ ప్రముఖులు . ప్లాపులు అందరు హీరోలకి సహజమే కానీ ఇప్పుడు చేయాల్సింది భవిష్యత్తు ప్రణాళిక . బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం చరణ్ బాగా కష్టపడుతున్నాడట . ప్రకటన దశ నుంచి ఈ సినిమాపై విపరీతమైన ఆశలు పెట్టుకున్నారు జనాలు. అయితే ఈ ఏడాది అక్టోబర్ లోనే సినిమా రిలీజ్ చేసే దిశగా బుచ్చిబాబు నిర్ణయం మారుతున్నట్లు సమాచారం అందుతుంది . చేతిలో ఇంకా పది నెలలే ఉన్నాయి . కాబట్టి రామ్ చరణ్ చాలా పక్కాగా కాల్ షీట్స్ ఇవ్వాలి ..చిత్ర యూనిట్ కూడా అందుకు సహకరించాలి అంటున్నారు జనాలు .
అంతేకాదు బుచ్చిబాబు స్క్రిప్ట్ ని టోటల్ గా మార్చేస్తున్నారట. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ లుక్స్ పై పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కొన్ని కొన్ని సీన్స్ కి నెగిటివ్ కామెంట్స్ దక్కాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ ఆర్ సి 16 సినిమాకి రాకుండా పక్కాగా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడట . కొన్ని కొన్ని సీన్స్ ని అసలు రూపురేఖలే మార్చేసుకున్నాడట . చరణ్ కూడా దానికి పూర్తి సహకారం అందించేందుకు ఓకే చెప్పారట. ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ అందుకోవడానికి కసిగా ఉన్నాడు . జాన్వి కపూర్ కూడా మంచి హిట్ అందుకొనె అందుకోలేదు . ఈ సినిమాతో ఆమె కోరిక నెరవేరబోతుంది. అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???