బాపట్ల జిల్లాలో ఉన్న మోహన్ థియేటర్లో పురందేశ్వరి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి డాకు మహారాజ్ సినిమాను చూశారని సమాచారం అందుతోంది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట సింహమని బాలయ్య నటన తనకు ఎంతగానో నచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
చిత్ర నిర్మాతలకు, దర్శకుడు బాబీకి సైతం ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 12వ తేదీన డాకు మహారాజ్ మూవీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించగా శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.
డాకు మహారాజ్ మూవీ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుండగా ఈ హీరో మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు. నందమూరి అభిమానులను మెప్పించే ప్రాజెక్ట్ లకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుండగా ఈ సినిమాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. బాలయ్య సోదరి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. బాలయ్య సక్సెస్ రేట్ ఊహించని స్థాయిలో అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.