ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎంతో కష్టపడి తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఎవరికీ తెలియని లాటరీ టిక్కెట్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మ్యానియా కొనసాగుతూ ఉంటే మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఎప్పుడో పుష్కర కాలం క్రితం విడుదల కావలసి ఉన్న విశాల్ ‘మదగజ రాజా’ సంక్రాంతికి విడుదలై సృష్టిస్తున్న కలక్షన్స్ సునామీ దక్షిణ భారత సినిమా రంగంలో సంచనంగా మారింది.

గత కొన్ని సంవత్సరాలుగా వరసపెట్టి పరాజయాలు తప్ప విజయాల గురించిమర్చిపోయిన కాలీవుడ్ హీరో విశాల్ కు ఇది ఊహించని ఘనవిజయం. వాస్తవానికి ఈసినిమా 2012లో మొదలై 2013 సంక్రాంతికి విడుదల కావలసి ఉంది ఈసినిమా నిర్మాతకు కొన్ని సమస్యలు ఈ సినిమా విడుదల పుష్కర కాలం ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈసినిమాను తమిళనాడులో అనేక సినిమాల పోటీ మధ్య విడుదల చేసిన తరువాత ఈసినిమాకు ఎవరు ఊహించని బ్లాక్ బష్టర్ హిట్ టాక్ వచ్చింది.

ఈమూవీకి తొలి రెండు రోజుల్లో 10 కోట్ల మేర వసూళ్లు రాబట్టడమే కాకుండా మూడవరోజు వచ్చేసరికి ఈమూవీ కలక్షన్స్ మరింత పెరిగి ఏకంగా 6 కోట్లు రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈ సంవత్సరం తమిళనాడులో దాదాపు అరడజను సినిమాలు విడుదల అనప్పటికీ ప్రేక్షకులు ఏసీనిమాను పట్టించుకోకుండా విశాల్ సినిమాకు క్యూ కట్టడం సంచలనంగా మారింది. ‘మద గజ రాజా’ కు ఏర్పడ్డ టికెట్ల డిమాండుకు.. అందుబాటులో ఉన్న స్క్రీన్లు సరిపోవడం లేదని ట్రేడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈసినిమాను యుఎస్‌లో రిలీజ్ చేయకపోవడంతో అక్కడి ప్రేక్షకులు నిరాశతో ఈమూవీ నిర్మాతలకు ఫోన్ చేస్తున్నట్లు టాక్.  విశాల్ పక్కన అంజలి వరలక్ష్మీ హీరోయిన్స్ గా నటించారు. సుందర్.సి ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా కథాకథనాలు రొటీన్ అయినప్పటికీ.. కామెడీకి, యాక్షన్ సన్నివేశాలకు, హీరోయిన్ల గ్లామర్‌ కు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోవడంతో ఘన విజయం ఈసినిమాకు వచ్చింది అంటున్నారు..  ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎంతో కష్టపడి తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుందో ఎవరికీ తెలియని లాటరీ టిక్కెట్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మ్యానియా కొనసాగుతూ ఉంటే మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఎప్పుడో పుష్కర కాలం క్రితం విడుదల కావలసి ఉన్న విశాల్ ‘మదగజ రాజా’ సంక్రాంతికి విడుదలై సృష్టిస్తున్న కలక్షన్స్ సునామీ దక్షిణ భారత సినిమా రంగంలో సంచనంగా మారింది.

గత కొన్ని సంవత్సరాలుగా వరసపెట్టి పరాజయాలు తప్ప విజయాల గురించిమర్చిపోయిన కాలీవుడ్ హీరో విశాల్ కు ఇది ఊహించని ఘనవిజయం. వాస్తవానికి ఈసినిమా 2012లో మొదలై 2013 సంక్రాంతికి విడుదల కావలసి ఉంది ఈసినిమా నిర్మాతకు కొన్ని సమస్యలు ఈ సినిమా విడుదల పుష్కర కాలం ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈసినిమాను తమిళనాడులో అనేక సినిమాల పోటీ మధ్య విడుదల చేసిన తరువాత ఈసినిమాకు ఎవరు ఊహించని బ్లాక్ బష్టర్ హిట్ టాక్ వచ్చింది.

ఈమూవీకి తొలి రెండు రోజుల్లో 10 కోట్ల మేర వసూళ్లు రాబట్టడమే కాకుండా మూడవరోజు వచ్చేసరికి ఈమూవీ కలక్షన్స్ మరింత పెరిగి ఏకంగా 6 కోట్లు రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఈ సంవత్సరం తమిళనాడులో దాదాపు అరడజను సినిమాలు విడుదల అనప్పటికీ ప్రేక్షకులు ఏసీనిమాను పట్టించుకోకుండా విశాల్ సినిమాకు క్యూ కట్టడం సంచలనంగా మారింది. ‘మద గజ రాజా’ కు ఏర్పడ్డ టికెట్ల డిమాండుకు.. అందుబాటులో ఉన్న స్క్రీన్లు సరిపోవడం లేదని ట్రేడ్ వర్గాలు కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈసినిమాను యుఎస్‌లో రిలీజ్ చేయకపోవడంతో అక్కడి ప్రేక్షకులు నిరాశతో ఈమూవీ నిర్మాతలకు ఫోన్ చేస్తున్నట్లు టాక్.  విశాల్ పక్కన అంజలి వరలక్ష్మీ హీరోయిన్స్ గా నటించారు. సుందర్.సి ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా కథాకథనాలు రొటీన్ అయినప్పటికీ.. కామెడీకి, యాక్షన్ సన్నివేశాలకు, హీరోయిన్ల గ్లామర్‌ కు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోవడంతో ఘన విజయం ఈసినిమాకు వచ్చింది అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: