ఈ మధ్యకాలంలో రియాలిటీ షోస్ లో అదేవిధంగా పలు ఈవెంట్స్ లో అమ్మాయిలను చాలా ఇబ్బందికరంగా మారిపోయే సిచువేషన్ లో చూడాల్సి వస్తుంది . తాజాగా అలాంటి ఒక సిచువేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జబర్దస్త్ కామెడీయన్స్ కొన్ని కొన్ని సార్లు హద్దులు మీరిపోతూ ఉంటారు . అది తెలిసి చేస్తారు అని చెప్పలేము కానీ తెలియకుండానే కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది.  ఆఫ్ కోర్స్ తెలిసి కూడా అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు . అయితే రీసెంట్ గా  బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కమెడియన్ సీరియల్ ఆర్టిస్ట్ అయిన ప్రియాంక జైన్ పట్ల ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .


స్టేజి మీద షో మామూలుగానే జరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో బ్లాక్ కలర్ షాట్  డ్రెస్ లో ప్రియాంక స్టేజ్ మీదకు వచ్చింది . వెంటనే బుల్లెట్ భాస్కర్ కూడా బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వచ్చేసరికి ఆమెతో కలిసి స్టెప్స్ వేస్తూ పనిలో పని ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు.  అయితే ఆమె షాట్ డ్రెస్ వేసుకొని ఉంది మోకాళ్ళ పై వరకు ఆ డ్రెస్ ఉంది . అది కొంచెం  ఇబ్బందికర సిచువేషన్ లోకి ప్రియాంక ని నెట్టేసింది.  ఆ హఠాత్పరిమానానికి ప్రియాంక  షాక్ అయింది . వెంటనే దింపేశాడు భాస్కర్ .



అంతేకాదు ప్రియాంక ఫైర్ అవుతూ.." చూసుకోవచ్చు కదా డ్రెస్ బాగాలేదు.. లిఫ్ట్ చేయొద్దు అని చెప్పాను కదా..? అంటూ అరిచేసింది. భాస్కర్ కూడా షాక్ అయిపోయాడు. సిచువేషన్ ని కంట్రోల్ లోకి తీసుకోరావడానికి అదేదో ముందే చెప్పాలండి వచ్చిన తర్వాత కంఫర్టబుల్ గా లేదు అంటే ఎలా..?" అంటూ రివర్స్ అవుతాడు . "లిఫ్ట్ చేస్తారని తెలియదు కదా మాకు ..? అంటూ ప్రియాంక మళ్ళీ రివర్స్ అవుతుంది. వాళ్ల మాటలకు మధ్యలో పాగల్ పవిత్ర ఎంట్రీ ఇచ్చి నేను ముందే మీకు చెప్పాను తన డ్రెస్ కంఫర్టబుల్గా లేదు అని అంటూ సిచువేషన్ ని ఇంకా హీట్ పెంచేసింది".



" ఇక లేడీస్ అందరు తగులుకునే సరికి భాస్కర్ పరువు పోయినట్లయింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియక భాస్కర్ వేసుకునే వాళ్ళకి తెలుస్తుందండి ఆ డ్రస్ కంఫర్టబుల్గా ఉంటుందో..? లేదో..? మాకు ఎలా తెలుస్తుంది చూసేవాళ్ళకి "అంటూ రివర్స్ గా ఆన్సర్ ఇస్తాడు . దీంతో ప్రియాంక  కోపంతో స్టేజి దిగి వెళ్ళిపోతుంది. అయితే దీని పట్ల నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు . కొందరు ప్రియాంక  సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు బుల్లెట్ భాస్కర్ కి సపోర్ట్ చేస్తున్నారు . భాస్కర్ చెప్పినదానితో అబద్ధం ఏముంది. తనకి కంఫర్టబుల్గా డ్రెస్ లేనప్పుడు ముందే చెప్పేయాలి అంటున్నారు. కానీ ప్రియాంక కి మాత్రం లేడీస్ సపోర్ట్ చేస్తున్నారు కావాలనే భాస్కర్ ఇలా ఆమెను ఎత్తుకొని వల్గర్ గా బిహేవ్ చేశాడు అంటూ బూతులు తిడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: