అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్నారు హీరోలు అన్న.. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయికి చేరుకుంది అన్న దానికి ప్రత్యేకంగా పరోక్షంగా రెండు విధాల కారణమయ్యారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ..అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు . వీళ్ళిద్దరే సినిమా ఇండస్ట్రీకి పిల్లర్స్ లా నిలిచి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేలా కృషి చేశారు.


కాగా అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి ఎంత చెప్పుకున్నా అది చిన్నగానే ఉంటుంది . ఎటువంటి క్యారెక్టర్ లోనైనా సరే లీనం అయిపోయినటించడం ఆయన స్పెషాలిటీ.  అది విలన్ షేడ్స్ అయినా.. హీరో షేడ్స్ అయినా.. కామెడీ సీన్స్ ..సెంటిమెంట్ పాత్ర .. రొమాంటిక్ పాత్ర ఒకటా రెండా ఆల్ రౌండర్ అనే చెప్పాలి . అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి . అయితే కెరియర్ పరంగా ఎంత టాప్ పొజిషన్లో ఉన్నా.. పర్సనల్ లైఫ్ పరంగా కూడా అలాంటి ఒక టాప్ పొజిషన్ అందుకున్నాడు అక్కినేని నాగేశ్వరరావు గారు .



కాగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఆఖరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు . అయితే అక్కినేని నాగేశ్వరరావు గారు తన ఆఖరి కోరిక తీరకుండానే మరణించారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆయన ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "స్టేజిపై త్రిష తో డాన్స్ చేయాలని ఉంది అని.. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా" అంటూ త్రిషపై పొగడ్తల వర్షం కురిపించారు . అంతేకాదు ఛాన్స్ వస్తే త్రిషతో కలిసి చిందులు వేయాలి అనుకుంటున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆయన కోరిక తీరకుండానే మరణించారు . ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు . నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు చాలామంది ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడుకున్నారు . 'మనం' సినిమాలో శ్రేయ శరణ్ బదులు త్రిషని పెట్టిన బాగుండేది అంటూ చాలామంది సజెషన్స్ కూడా ఇచ్చారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

ANR