ముఖ్యంగా కోర్టు తీర్పు ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని మనోజ్ పై నిన్న మోహన్ బాబు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా తాతా నానమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చిన మనోజ్ ఫ్యామిలీని, మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది, బౌన్సర్లు అడ్డుకొని వారిని లోపలికి పంపించలేదు. దీంతో ఆగ్రహించిన మంచు మనోజ్ ఎంతమంది బౌన్సర్లను పంపుతారో పంపండి. నేను ఒక్కడిని చాలు. వారికి సమాధానం చెప్పడానికి అంటూ మనోజ్ కూడా సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలోనే మంచు అనుచరులుగా భావిస్తున్న యువకుల బృందంలో ఒకరు మనోజ్ వాహనంపై కర్రతో దాడి చేశారు. కాగా, కోర్టు ధిక్కరణకు పాల్పడిన మనోజ్ పై పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో నేడు మోహన్ బాబు పై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నారు మనోజ్ అని సమాచారం. మరి రోజు రోజుకి ఈ కుటుంబంలో గొడవలు మరింత ఉద్రిక్తతగా మారుతున్నాయి. ఇక ఈ కుటుంబంలో మంటలు ఎప్పుడు చల్లారుతాయో అని, అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు కుటుంబంలో గొడవలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని చెప్పవచ్చు.