నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్.. ఈ చిత్రం భారీ అంచనాలతో సంక్రాంతికి విడుదలై అభిమానులనే కాకుండా మాస్ ఆడియన్స్ ని కూడా బాగా అలరించింది. బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పుడు బాలయ్య రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా ఈ సినిమాతో తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో బాలయ్య మరొక క్రేజీ ఫీట్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.


అదేమిటంటే అఖండతో కం బ్యాక్ ఇచ్చిన బాలయ్య ఆ తర్వాత ఇప్పటివరకు విడుదలైన డాకు మహారాజ్ సినిమాతో వరుసగా నాలుగు సినిమాలతో 100 కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్న సీనియర్ హీరోగా అరుదైన రికార్డును అందుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు సీనియర్ స్టార్ హీరోలలో ఈ ఫిట్ అందుకున్న వారు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇలా మొత్తానికి ఒక మాస్ రికార్డును బాలయ్యే సెట్ చేశారని చెప్పవచ్చు. డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య గత సినిమాలలో నటించిన వాటికంటే వేగంగానే 100కోట్ల క్లబ్ లోకి చేరారు. మరి ఫైనల్ గా ఎంతవరకు ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.


బాలయ్య నటించిన చిత్రాలు ఈ మధ్యకాలంలో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకోవడంతో బయ్యర్లు కూడా బాలయ్య సినిమాలు కొనడానికి కాస్త మక్కువ చూపుతున్నారట.. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన చిత్రాలలో కంటే ఈ సినిమానే కొంతమేరకు బెటర్ అని బయ్యర్లు కూడా నమ్మడంతో పాటుగా తక్కువ మొత్తంలో పెట్టుబడి కావడం చేత ఎక్కువ మొత్తంలో లాభాలను అందుకుంటున్నారట. బాలయ్య తదుపరి చిత్రాల విషయానికి వస్తే బోయపాటి శ్రీను తో అఖండ 2 సినిమాని చేయబోతున్నారు మరి ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: