బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే కత్తిపోటుకు గురైన ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరు అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారుతుంది. అర్ధరాత్రి 2.33 గంటల సమయంలో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఓ దుండగుడు సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి పారిపోతూ కెమెరా కంటపడ్డాడు. ఇప్పుడు ఆ ఫోటోను ముంబై పోలీసులు రిలీజ్ చేశారు.



అతని కోసం విపరీతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, సైఫ్ ఆలీ ఖాన్ నివాసంలోని పనిమనిషితో దుండగుడు మొదటగా గొలుడవబడినట్లుగా సమాచారం అందుతోంది. పనిమనిషిపై దాడిని అడ్డుకునేందుకు సైఫ్ అలీఖాన్ ప్రయత్నించగా దుండగుడు కత్తితో విరుచుకు పడినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆ దుండగుడు దొంగతనం కోసమే అతని ఇంట్లోకి వెళ్లారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునే మార్గం ద్వారా అతడు సైఫ్ నివాసంలోకి ఎంట్రీ ఇచ్చారు.


అతని కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయని జోన్-9 డిసిపి దీక్షిత్ వెల్లడించారు. కాగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు వచ్చిన బెదిరింపుల కారణంగా బాలీవుడ్ లో కాస్త కంగారు నెలకొంది. ఇలాంటి సమయంలో దాడి జరగడం మరింత సంచలనంగా మారుతుంది. క్రికెటర్ షర్మిల ఠాగూర్ సంతానమైన సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు.


కాగా,బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఇంట్లోకి వచ్చి దాడి చేసే ముందు సైఫ్ అలీఖాన్ ను రూ. కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడైంది. దీనికి సైఫ్ ఒప్పుకోకపోవడంతో నిందితుడు దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటికి వచ్చే అవకాశముంది. కాగా, ప్రస్తుతం సైఫ్ ఆలీఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: