గతంలో విడుదలైన టీజర్ ఒక మోస్తారుగా ఆకట్టుకున్నప్పటికీ తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది.. తాజాగా పట్టుదల అనే టైటిల్ తో అజిత్ సినిమాని తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్లో అజిత్, త్రిష మధ్య ప్రేమని చూపించి ఆ తర్వాత అనుకోకుండా వీరి మధ్యకి ఒక సమస్య వస్తుంది ఆ సమస్యని హీరో అజిత్ ఎలా పోరాడారు అనే విధంగా చూపించారు. ఇందులో అజిత్ యాక్షన్స్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
పట్టుదల సినిమా ఇటీవలే సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది.ఈ సినిమా వచ్చే నెల 6వ తేదీన తెలుగు,తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు ట్రైలర్లు అయితే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి పట్టుదల సినిమా ట్రైలర్ లో మాత్రం హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్స్ సన్నివేశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది హీరోయిన్ రెజీనాకి కూడా ఇందులో ఒక కీలకమైన పాత్ర ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి సైలెంట్ గా సాగే ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మార్చడంతో సినిమా ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు.