గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం సినిమాల కు దూరంగా ఉంటుంది. కానీ ఒకప్పుడు అయితే ఈ హీరోయిన్ తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా దేవదాసు - పోకిరి సినిమాలో ఇలియానా సన్న ని నడుము చూసిన తెలుగు సినీ ప్రేమికులు ఆమెకు పిచ్చ ఫిదా అయిపోయారు. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఇలియానాకు ఒక్కసారిగా టాలీవుడ్ లో తిరిగిలేని క్రేజ్ వచ్చేసింది. ఈ క్రమంలో ఎవరిని అయినా పొగిడే క్రమంలో అచ్చం నీ నడుము ఇలియానాలా ఉంటుంది అన్నంత పాపులారిటీ ఆమెకు వచ్చేసింది. అయితే ఇలియానా ఓ డైరెక్టర్ కోరిక తీర్చలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని ప్రయత్నించిందట. అప్పట్లో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఇలియానా స్వయంగా చెప్పడంతో ఇది మీడియాలో బాగా వైరల్ అయింది. ఇలియానా ఆ డైరెక్టర్ పేరు చెప్పలేదు .. కానీ తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమంది తనను లైంగికంగా వేధించారు .. అలాంటి వారిలో ఓ తెలుగు దర్శకుడు కూడా ఉన్నాడు .. అతడి కోరిక తీర్చలేక నేను ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను అని తెలిపింది.
ఆ సమయంలో నా కుటుంబం గుర్తుకు రావడంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాను అని ఇలియానా చెప్పింది. ఎవరో ఒక మూర్ఖుడు కోసం నా ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించానని .. మళ్లీ టాలెంట్ తో సినిమాల్లో అవకాశాలకు సంపాదించి వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించాను అని ఇలియానా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇలియానా అప్పట్లో తెలుగు డైరెక్టర్ అని చెప్పడంతో ఆ తెలుగు డైరెక్టర్ ఎవరు ? ఇలియానా కలిసి పనిచేసిన ఆ డైరెక్టర్ పేరు ఏమిటి ? అన్నదానపై కొందరు పేర్లు కూడా చర్చించుకోవడం విశేషం.