అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎలాంటి సినిమా అయినా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి-వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 తేదీన థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు.


ఈ సినిమాలో వెంకటేష్ తన అద్భుతమైన నటన, కామెడీతో అభిమానులను నవ్వించాడు. వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. వెంకటేష్ లవర్ పాత్రలో మీనాక్షి చౌదరి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అందంగా మెరిసింది. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో భారీగా కలెక్షన్ ను సొంతం చేసుకుంటుంది. కాగా, ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.


అందులో భాగంగా మాట్లాడుతూ.... సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నిజానికి ఆ పాత్ర తన వద్దకు వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారని ఐశ్వర్య చెప్పింది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ముందే నాతో చెప్పారని వెల్లడించింది. నలుగురి పిల్లల తల్లి పాత్ర కావడంతో ఈ సినిమాని ప్రతి ఒక్క హీరోయిన్ రిజెక్ట్ చేసినట్లుగా ఐశ్వర్య చెప్పారు.


నలుగురు పిల్లల తల్లి పాత్ర అయినప్పటికీ అది పెద్ద ఇష్యూ అనిపించలేదని ఐశ్వర్య అన్నారు. ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర దొరకడం నా భాగ్యం. కచ్చితంగా ఈ సినిమా చూసిన అనంతరం భాగ్యం పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్లు చాలా బాధపడతారు అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: