నందమూరి బాలకృష్ణ వరుసపెట్టి సినిమాలలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదివరకే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బాలకృష్ణ 100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.


తాజాగా బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. డాకు మహారాజ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలై మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా బరిలోకి వచ్చింది. ఈ సినిమా విడుదలై నాలుగు రోజుల రన్ ని విజయవంతంగా పూర్తిచేసుకుంది.


అయితే నాలుగో రోజు కలెక్షన్లు పిఆర్పి లెక్కల ప్రకారం ఏరియాను వారిగా చూసినట్లు అయితే.... నైజాం లో రూ. 10.15 కోట్లు, సీడెడ్ లో రూ. 9.87 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.68 కోట్లు, గుంటూరులో రూ. 5.89 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.18 కోట్లు, తూర్పుగోదావరిలో రూ. 4.16 కోట్లు, కృష్ణలో రూ. 3.72 కోట్లు, నెల్లూరులో రూ. 2.49 కోట్లు కలెక్షన్లను సొంతం చేసుకుంది. మొత్తంగా రూ. 40 కోట్ల షేర్ ని డాకు మహారాజ్ సినిమా సొంతం చేసుకుంది.


ఒక్క తెలుగు రాష్ట్రం నుంచి ఇంత మొత్తం అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది కూడా జీఎస్టీని తీసేసి రూ. 45.14 కోట్ల కలెక్షన్లను అందుకోవడం విశేషం. బాలకృష్ణ కలెక్షన్లను చూసి నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే నందమూరి బాలకృష్ణ అఖండ-2 సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్లను ఫైనల్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: