ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి హీరో మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇకపోతే అప్పుడెప్పుడో మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా గత సంవత్సరం సెప్టెంబర్ లో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా బయటకి రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల రిలీజ్ అవ్వడానికి మరింత ఆలస్యం అవుతుందట. ఫిబ్రవరిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ సినిమాని ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఇప్పుడు ఇంకాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే మోక్షజ్ఞ విదేశాలకు వెళ్లబోతున్నారట. అక్కడ తన సినిమా గురించి మాట్లాడుకుంటారని తెలుస్తోంది. మోక్షజ్ఞ ఇంకా తన సినిమా విషయంలో కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నాడట.
తన మొదటి సినిమా ఎవరితో చేయాలన్న విషయంలో ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేదట. అందుకే తన మొదటి సినిమా విషయంలో ఇంత సమయం తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఇదివరకే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో కలిసి సినిమా తీయాలని కథను కూడా రెడీ చేశారట. ప్రశాంత్ వర్మ కథని మోక్షజ్ఞ ఫైనల్ చేస్తే ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఈ విషయంపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.