గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం రామ్ చరణ్ సోలో హీరోగా గేమ్ చేంజర్ సినిమాలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ పాత్రను పోషించాడు. తండ్రి కొడుకు పాత్రలో నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్లుగా కియారా అద్వానీ, అంజలి నటించారు.


ఎస్ జె సూర్య విలన్ పాత్రను పోషించాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా.... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ భారీగా కలెక్షన్లను రాబడుతోంది. గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది.


ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా.... దర్శకుడు శంకర్ తన తదుపరి సినిమా గురించి కీలకమైన అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇండియన్-3 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇండియన్-3 సినిమా షూటింగ్ మరో ఆరు నెలలలో పూర్తవుతుందని శంకర్ వెల్లడించారు. కేవలం విఎఫ్ఎక్స్ పనులు మాత్రమే పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని శంకర్ అన్నారు. అంతేకాకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.


గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కావడంతో ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇండియన్-3 సినిమా పైనే పెట్టినట్లుగా శంకర్ తాజాగా వెల్లడించారు. కాగా, ఇండియన్-3 సినిమాలో కమల్ హాసన్, కాజల్, సిద్ధార్థ్ వంటి ప్రముఖ నటిమణులు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం శంకర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: